అవంతి ఫీడ్స్ లిమిటెడ్, శ్రీనివాస సిస్టైన్ మరియు అవంతి ఫ్రోజెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా స్థాపించిన దాతృత్వ సంస్థ అయినటువంటి అవంతి ఫౌండేషన్‌కు స్వాగతం. మేము భావి భారత పౌరుల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి మరియు మెరుగైన భవిష్యత్తును ఏర్పరచడానికి అంకితభావంతో ఉన్నాము. అవంతిలో, మేము సంఘం యొక్క శక్తిని మరియు మా కార్యక్రమాలను రూపొందించడంలో దాని కీలక పాత్రను విశ్వసిస్తాము. సమాజం పట్ల మా నిబద్ధత అనేది మేము చేసే ప్రతిదానిలో అనగా మేము ఎలా ఆలోచిస్తామో మరియు మేము ఎవరు అనే దానిలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది.
అవంతి ఫౌండేషన్ 2019లో ఆక్వా రైతులకు సహాయం చేయడం మరియు మెరుగైన విద్యను అందించుట, ఆరోగ్యం, జీవనోపాధి మరియు మౌలిక సదుపాయాల ద్వారా సంఘాలను బలోపేతం చేయాలి అనే ప్రాథమిక లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. ఈ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, వృత్తి శిక్షణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు మరియు క్రీడలు వంటి రంగాలలో పనిచేస్తుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో.
అవంతి ఫౌండేషన్ మరియు ఆంధ్రా యూనివర్శిటీ వారి సహకారంతో, ఈ ప్రతిష్టాత్మకమైన కేంద్రం విద్యార్థులకు, రైతులకు, మత్స్యకారులకు మరియు ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికి ఆక్వాకల్చర్‌లో అత్యాధునిక శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధిని అందిస్తుంది. ఈ సెంటర్ ద్వారా అకాడమిక్ ట్రైనింగ్ మరియు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా వాటి మధ్య అంతరాన్ని తగ్గించి వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది, అలాగే వ్యక్తుల యొక్క అభిరుచులను కొనసాగించడానికి మరియు ఆక్వాకల్చర్ పరిశ్రమలో సమర్థవంతమైన ప్రతిభను చూపడానికి వారిని శక్తివంతం చేస్తుంది.
కీలక విశిష్టతలు:
అర్థవంతమైన పరస్పర చర్యలకు అనుకూలమైన వాతావరణం
ప్రభావంతమైన శిక్షణా కార్యక్రమాలు
సమగ్ర అభ్యాసం మరియు ప్రయోగాత్మక అనుభవాలు
పూర్వ నేపథ్యం లేదా అనుభవంతో సంబంధం లేకుండా అందరికీ అవకాశం
ప్రయోజనాలు:
ఆక్వాకల్చర్‌లో అపూర్వమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను సంపాదించడం
మీ యొక్క ఉపాధి మరియు కెరీర్ అవకాశాలను మెరుగుపరచుకోవడం
విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తయారు అవ్వడం
ఆక్వాకల్చర్ పరిశ్రమకు సానుకూల సహకారం అందించడం
మీరు మా ప్రాజెక్ట్‌లలో
భాగంగా ఉండాలనుకుంటున్నారా?
అవంతి ఫౌండేషన్,
G-2, కాంకోర్డ్ అపార్ట్మెంట్స్,
6-3-658, సోమాజిగూడ,
హైదరాబాద్-500082
తెలంగాణ, భారతదేశం.
అవంతి ఫౌండేషన్ ద్వారా కాపీరైట్ 2024. అన్ని హక్కులు ఉన్నవి. పరేల్ చేత తయారు చేయబడింది.